ఆహాహా.. పవన్ కళ్యాణ్ గురించి అదిరిపోయే గాసిప్.!

Ahaha Stunning Gossip On Pawan Kalyan | Telugu Rajyam

వెండితెరపై మాస్ హీరోగా డైలాగుల వర్షం కురిపించే బాలయ్య, ఓటీటీ తెరపై ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆహా’ వేదికగా బాలయ్య, ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షోతో ఓటీటీ ఛానెల్‌పై తనదైన ముద్ర వేసేందుకు తొలిసారిగా బాలయ్య సంసిద్ధమవుతున్నారు.

కాగా, పలువురు సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో సాగే, ఈ షోకి స్పెషల్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారన్న వార్త ప్రచారంలో ఉండగా, ఆ విషయాన్ని రీసెంట్‌గా బాలయ్య దాదాపు కన్ఫామ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ టాక్ షోకి సంబంధించి మరో హాట్ టాపిక్ తాజాగా హల్‌చల్ చేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బాలయ్య సంప్రదింపులు చేశారన్నది ఆ హాట్ హాట్ న్యూస్ సారాంశం. అంటే, పవన్ కళ్యాణ్ కూడా ఈ టాక్ షోలో సందడి చేయబోతున్నారన్న మాట. పవన్ కళ్యాణ్‌ని బాలయ్య ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉండబోతోంది.?

సినీ, రాజకీయాల గురించిన ప్రశ్నలు పవన్‌పై సంధిస్తారా.? బాలయ్య టీడీపీ నాయకుడు, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఆ యాంగిల్‌లో బాలయ్య ప్రశ్నలుంటాయా.? లేక కేవలం సినిమాకే పరిమితమవుతాయా.? అసలీ గాసిప్‌లో నిజమెంత.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే, మళ్లీ బాలయ్య నుండే కన్‌ఫర్మేషన్ రావాలేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles