‘ఏజెంట్’ భామకు మెగా ఛాన్సులట.. నిజమేనా.?

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సూపర్ జోష్‌లో ఉన్న అఖిల్, తదుపరి చిత్రం ‘ఏజెంట్’తో బిజీ అయిపోయాడు. స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా. డిఫరెంట్ మేకోవర్‌తో అఖిల్ సరికొత్తగా కనిపించబోతున్నాడీ సినిమాలో.

ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త భామ సాక్షి వైద్య నటిస్తోంది. పెద్దగా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ, ఈ భామకు మోడలింగ్ టచ్ ఉందంతే. అయితే, తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ముఖ్యంగా ఓ మెగా ఆఫర్ అమ్మడిని చేరబోతోందనీ సమాచారం.

ఆల్రెడీ షూటింగ్‌లో పాల్గొంటోన్న ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్‌ సురేందర్ రెడ్డిని బాగా ఇంప్రెస్ చేస్తుండడంతో, సురేందర్ రెడ్డి ఓ మెగా హీరోకి ఈ భామను ప్రిఫర్ చేశాడనీ తెలుస్తోంది. ఇదెంత వరకూ నిజమో తెలీదు. కానీ, ఒకవేళ నిజమే అయితే, పాప దశ తిరిగిపోయినట్లేగా. అంతే కాదు, మెగా కాంపౌండ్‌లోనే ఈ భామ మరో సినిమాకి కమిట్ కానుందని తెలుస్తోంది.

సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించే సినిమా పూర్తయ్యాక, మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం కూడా సాక్షి పేరు దాదాపు ఖరారయ్యిందట.