Director Maruthi: కేరింత సినిమాలో తనకు అవకాశం రాకముందు వరకు అసలు ఎందుకు ఈ ఫీల్డ్, ఇంత చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నాయన్న భావన నిజమేనని నటుడు పార్వతీశం అన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఇండస్ట్రీని వదిలివేసి వెళ్లిపోవాలని మాత్రం తనకు ఎప్పుడూ అనిపించలేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ ఆగిపోలేదని, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నానని ఆయన తెలిపారు. నిజం చెప్పాలంటే తాను కోట శ్రీనివాసరావు లాగా ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చానని పార్వతీశం అన్నారు. సోలోగా చేసిన, చేస్తున్న సినిమాలు కూడా తన కెరీర్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు.
డైరెక్టర్ మారుతీ గారు ఓ సినిమా నేపథ్యంలో తనకు డబ్బులివ్వలేదని వచ్చిన ప్రచారంపై పార్వతీశం పెదవి విప్పారు. నిజం చెప్పాలంటే చెప్పిన సమయానికి అనుకున్నంత పారితోషికాన్ని ఇచ్చిన డైరెక్టర్ అంటే అది మారుతీ గారే అని ఆయన చెప్పారు. ఒక్కోసారి లేట్ అయితే తాను ఫోన్ చేసి అడిగిన గంటలోపే ఆ డబ్బు తన అకౌంట్‌లోకి వచ్చేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ క్యాష్ ఉంటే ఆఫీస్‌కెళ్లి తీసుకోండని వాళ్లు అనేవారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా మారుతీ దగ్గర 2 సినిమాలు చేశానన్న పార్వతీశం, ఎప్పుడూ డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనలేదని ఆయన చెప్పారు. ఈయనే కాదు తాను చేసిన క్యారెక్టర్స్‌కి ఎవరూ తనకు డబ్బులు ఎగ్గొట్టలేదని ఓ ఇంటర్వ్యూ సందర్భంలో పార్వతీశం వెల్లడించారు.