“భీమ్లా నాయక్” నుంచి అసలు సిసలు మాస్ ట్రీట్ సిద్ధం.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రానా దగ్గుబాటి ల కాంబోలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ అదిరే అప్డేట్ ని ఇచ్చారు. ఈ సినిమాలో అసలు సిసలు అయినటువంటి మాస్ సాంగ్ లా లా భీమ్లా ను రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఈరోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ సాంగ్ పోస్టర్ లో కూడా పవన్ పూనకలు తెప్పించే రేంజ్ లో కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ పై మాత్రం ఎప్పుడు నుంచో హై అంచనాలు ఉన్నాయి. ఇక వచ్చే ఈ ప్రోమో లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.