సాధారణంగా భోజనం చేసే సమయంలో అప్పుడప్పుడు భోజనంలో వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు వెంట్రుకలు కనిపించడం సర్వసాధారణం. ఇంట్లో కానీ హోటల్స్ లో కానీ వంట చేసే సమయంలో ఇలా వెంట్రుకలు పడుతూ ఉంటాయి. అయితే ఇటీవల భోజనంలో వెంట్రుక వచ్చిందని ఆగ్రహానికి గురైన భర్త ఆ భార్యకు గుండు చేయించిన ఘటన వైరల్ గా మారింది.
వివరాలలోకి వెళితే…పిలిభిత్‌లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలక్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల సీమా దేవి శుక్రవారం సాయంత్రం ఇంట్లో తన భర్తకు భోజనం వడ్డించింది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆహారంలో వెంట్రుకలు కనిపించడంతో ఆమె భర్త జహీర్ ఉద్దీన్‌కు ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన సోదరులు జమీరుద్దీన్ బరాసత్, జులేఖా ఖాతూన్‌లతో కలిసి సీమాదేవి మీద దాడి చేశారు. దీంతో అంతేకాకుండా ఆమె జుట్టు కత్తిరించి గుండు చేశారని.. ఆ తర్వాత తన కాళ్లు చేతులు కట్టేసి నోటిలో గుడ్డ అడ్డంగా పెట్టి తనపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడని భర్తపై సీమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన అత్తమామలు మరదలు కూడా తన భర్తకు సహకరిస్తూ తనపై దాడికి దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
ఏడేళ్ల క్రితం వివాహం జరిగిన తనకు అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని ఈ సందర్భంగా పోలీసులకు తన బాధను వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాదేవి భర్తతో సహా అత్త మరుదులపై కూడా వరకట్న వేధింపుల కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించినట్లు సిఓ సిటీ సతీష్ శుక్లా వెల్లడించారు.