పక్కింటి వారితో గొడవపడి కుమారుడిచావుకు కారణమైన తల్లి..?

సాధారణంగా ఒక ప్రదేశంలో నివాసం ఉంటే ఏదో ఒక సందర్భంలో ఎదురింటి వారితో, పక్కింటి వారితో చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి గొడవలు కొన్ని సందర్భాలలో చిలికి చిలికి గాలి వానగా మారినట్లు పెద్దగా అవుతూ ఉంటాయి. చిన్నగా మొదలైన ఇలాంటి గొడవల వల్ల ఒకరికొకరు కొట్టుకోవడమే కాకుండా హత్యలు చేసే స్థాయికి కూడా దిగజారి పోతున్నారు. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పక్కింటి వారితో గొడవపడి వనస్థాపం చెందిన మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. కానీ అదృష్టం కొద్దీ మహిళ ప్రాణాలతో బయటపడగా ఇద్దరి కుమారులలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

వివరాలలోకి వెళితే.. ప్రీతి అనే మహిళ కి ఎదురింటి గొడవ పడింది . ఇలా గొడవ పడటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిన గొడవ పెద్దదై ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అయితే బిల పొరుగింటి వారితో గొడవ పడటంతో ప్రీతి కుటుంబ సభ్యులు కూడా ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కుటుంబ సభ్యులు కూడా తనని మందలించడంతో మనస్థాపం చెందిన ప్రీతి తన ఇద్దరు కుమారులు అన్ష్ ప్రతాప్ (9), అభయ్ ప్రతాప్ (5) తో కలిసి బావిలో దూకింది.

అయితే, ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రీతితో పాటు ఆమె పెద్ద కుమారుడు అన్ష్ ప్రతాప్ ప్రాణాలతో బయటపడగా.. చిన్న కుమారుడు అభయ్ ప్రతాప్ మాత్రం నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా కుటుంబసభ్యులు మందలించడంతో ప్రీతి తన కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.