వైరల్ కామెంట్: ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే…!

తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ న్యూ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా మోడీ నియంతృత్వంగా వ్యవహరించారని చెబుతూ… కాంగ్రెస్ పార్టీ సహా 19 పార్టీలు బహిరంగంగా బాయ్ కాట్ చేశాయి. అనంతరం బీఆరెస్స్ కూడా బాయ్ కాట్ చేసింది. అయితే తాజాగా జరిగిన ఈ కార్యక్రమంపై మేధావులూ, నెటిజన్లు ఫైరవుతున్నారు. మోడీకి ఫ్యూచర్ గుర్తుచేస్తున్నారు!!

తాజాగా ఢిల్లీలో ప్రజాధనంతో నిర్మించిన భారత నూతన పార్లమెంటును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించారు. ఒకటి.. పూజలు రాజదండాన్ని ప్రతిష్టించి పార్లమెంటు ను ప్రారంభించడం, రెండోది.. దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించడం. అయితే.. తొలి దశ కార్యక్రమానికి ఎంపీలను ఎవరినీ పిలవలేదు. ఇదేదో మోడీ వ్యక్తిగత వ్యవహారంలాగా… పది మంది సాధువులను, పీఠాధిపతులు అనబడేవారినీ పక్కన పెట్టుకుని పని కానిచ్చేశారు. ఒక్కసారిగా ఇది ప్రజాస్వామ్య దేశమేనా, లౌకిక దేశమేనా అనే అనుమానం కలిగించారు!

రెండో దశ కార్యక్రమానికి అంటే… ఎంపీలను ఎదురుగా కూర్చోబెట్టి, జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించే కార్యక్రమానికి మాత్రం అందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోడీ.. తమిళనాడుకు చెందిన కొందరు సాధువులతో గ్రూప్ ఫొటో దిగారు. దీనిని ఆయన ట్వీట్ కూడా చేశారు. అయితే దీనిపైనే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీకితోడుగా మరోఫోటో జతచేసి ప్రజల కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటును ప్రారంభించిన సమయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న గ్రూప్ ఫొటో అది. ఈ ఫొటోలో ఎక్కడా సన్యాసులు.. మఠాధిపతులు కనిపించరు. ఏ మతానికి చెందిన వారూ కనిపించరు. కేవలం స్వాతంత్ర సమర యోధులు, దేశ నాయకులు, ప్రజాసేవకులు మాత్రమే ఉంటారు. ఈ రెండు ఫొటోలను జత కలిపి.. నెటిజన్లు మోడీ పై ఒక్కరేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.

భారతదేశం ఫూచర్ ఎలా ఉండబోతుందో ఒక ఫోటో చెప్పబోతుంది అంటూ ఆన్ లైన్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నవ్విపోదురు గాక నాకేటి అన్న చందంగా మోడీ వ్యవహారశైలి ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దేశంలో 547 మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీలున్నా.. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం దక్కకపోవడాన్ని ప్రశ్నిస్తూ… వీరంతా పూజకు పనికిరాని పూలా? అని సెటైర్స్ వేస్తున్నారు. దేశప్రజలకు ఇప్పటికైనా కొన్ని విషయాల్లో కళ్లు తెరుచుకోవాలని ప్రార్ధిస్తున్నారు!