ఒక జేబులో డబ్బు, ఇంకో జేబులో మందు..ఇది అల్లరి నరేష్ కథ

Interesting First Look From Allari Naresh'S Sabhaku Namaskaram
అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అనేలా ఉండేవి. వరుసపెట్టి కామెడీ ఎంటర్టైనర్లు చేస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన నరేష్ అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు కూడ చేసేవాడు.  ‘నేను, గమ్యం, విశాఖ ఎక్స్ ప్రెస్’ లాంటి చిత్రాలతో తనలోని నటుడ్ని ప్రూవ్ చేసుకున్నాడు.  ఇప్పుడు కామెడీ కథలను పక్కనపెట్టి సీరియస్ సినిమాలే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవలే ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన ఈసారి ‘సభకు నమస్కారం’ అంటున్నాడు. ఈరోజు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు టీమ్.  ఫస్ట్ లుక్ అయితే కాస్త డిఫరెంట్ అనేలానే ఉంది. 
 
స్పీచ్ ఇవ్వడానికి స్టేజి మీదకు ఎక్కిన నరేష్ బ్యాక్ పాకెట్ ఒకదాంట్లో డబ్బు కట్టలు, ఇంకో పాకెట్లో మందు బాటిల్ కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో సోషల్ అంశాలు ఏవైనా ఉంటాయేమో అనిపిస్తోంది.  ఇంకోవైపు టైటిల్ చూస్తే సెటైరికల్ కామెడీ గుర్తొస్తోంది. మొత్తానికి నరేష్ ఈసారి భిన్నమైన ప్రయోగంతో మన ముందుకు వస్తాడని అనిపిస్తోంది.  సతీష్ మల్లంపాటి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత అబ్బూరి రవి కథను అందిస్తున్నారు.  ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles