వర్షిణి సోదరిని కూడా వదల్లేదు.. హైపర్ ఆది మామూలోడు కాదు

హైపర్ ఆది వర్షిణి జోడికి ఉన్న పాపులార్టీ అందరికీ తెలిసిందే. ఢీ షోలో వీరు చేసే రచ్చకు పండించిన కెమిస్ట్రీకి ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందేమో అని వార్తలు రాసేశారు. అక్కడితో ఆగకుండా ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతోన్నారని రూమర్లను పుట్టించేశారు. కానీ తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెబుతుంటారు. అందరూ అనుకుంటున్నట్టుగా ఏమీ లేదని రూమర్లను ఖండిస్తుంటారు.

Varshini sister Soujanya Sounderajan Prank Call To Hyper Aadi
Varshini sister Soujanya Sounderajan Prank Call To Hyper Aadi

తాజాగా వర్షిణి యాంకర్ రవి తన యూట్యూబ్ చానెల్‌లో చేసే ఇంటర్వ్యూలో పాల్గొంది. వర్షిణి మాత్రమే కాకుండా ఆమె అక్క సౌజన్య కూడా పాల్గొంది. ఇంతవరకు బయటకు ఎక్కడా కూడా ప్రొజెక్ట్ కానీ సౌజన్య మొదటిసారి యాంకర్ రవి యూట్యూబ్ చానెల్ కోసం కెమెరా ముందుకు వచ్చింది. వర్షిణి సీక్రెట్ల గురించి చెబుతూ ఆమె పరవుతీసేసింది. అంతేకాకుండా హైపర్ ఆదికి ఫ్రాంక్ కాల్ చేసి ఆటపట్టిద్దామని ప్రయత్నించింది.

కానీ రివర్స్‌లో హైపర్ ఆదియే ఆమెను ఆడుకున్నాడు. ఫోన్ చేసి వర్షిణితో ఉన్న రిలేషన్, అలా చేస్తే ఎలా అంటూ కాస్త సీరియస్‌గా మాట్లాడదామని ప్రయత్నించింది వర్షిణి సోదరి. కానీ ఆది ముందు ఆ పప్పులేమీ ఉడకలేదు.. మేం మీ సిస్టర్‌ను ఏం చేశామండి.. మీ చెల్లి వేసే చీమ ఏనుగు జోకులను మేమే ఎలా భరించాలో తెలియకుండా ఉంటే మీరిలా అంటారా? అని రివర్స్‌లో ఆడుకున్నాడు. మొత్తానికి వర్షిణినే కాదు ఆమె అక్కను కూడా ఆది బెదరగొట్టేశాడు.

Dhee-wali Varshini & Soujanya Sounderajans with Anchor Ravi Promo | Diwali Special Interview