Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా అందరికీ పరిచయమైన హైపర్ ఆది తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగ్ తో అందరిని కడుపుబ్బా నవ్వించేవారు. ఇలా కమెడియన్ గా ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు. ఇకపోతే హైపర్ ఆది గత ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేయటమే కాకుండా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు అంతేకాకుండా ఈయన పలు కార్యక్రమాలలో భాగంగా వైసిపిని టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఆది తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేసిన కమెడీయన్స్ కొంతమంది సినీనటి వైసిపి మాజీ మంత్రి ఆర్కే రోజాని కూడా టార్గెట్ చేస్తూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే హైపర్ ఆది తాజాగా రోజా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా గారికి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఇది పూర్తిగా మా వ్యక్తిగత అభిప్రాయాలని ఆది తెలియజేశారు. అయితే వ్యక్తిగతంగా రాజకీయాలకు అతీతంగా నాకు రోజగారంటే చాలా గౌరవం నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణమైన వారిలో రోజా గారు కూడా ఒకరు. నేను ఆమెను రాజకీయాల పరంగా కాని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడూ విమర్శించింది లేదని, తనంటే నాకు ఎంతో గౌరవం అంటూ రోజా గురించి ఆది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
