నానీని ఒప్పించుకున్న ఒకే ఒక్కడు..

సినీ పరిశ్రమలో ఓ హీరో నిలదొక్కుకోవాలి అంటే వారికి అదృష్టంతో పాటుగా తన వే ఆఫ్ ఛాయిస్ కూడా చాలా ముఖ్యం అని చెప్పాలి. మరి అలా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో నిలదొక్కుకున్న యంగ్ హీరోస్ లో ఒకడే నేచురల్ స్టార్ నాని. కాగా నాని రీసెంట్ గా నటించిన చిత్రం “హాయ్ నాన్న” తన కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచింది.

అయ్యితే ఇప్పుడు వరకు నానీ సినిమాలు చూస్తే ఆల్ మోస్ట్ తెలుగు దర్శకులే అందులోని కొత్త వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. అయితే తమిళ్ దర్శకునితో ఎప్పుడో ఓ సినిమా చేసాడు కానీ అది అంతగా రాణించలేదు. అయితే అప్పటి నుంచి మళ్ళీ నానితో సినిమా చేయాలని కోలీవుడ్ నుంచి చాలా మంది ట్రై చేశారు.

కానీ ఏ ఒక్కరు కూడా నానీని మెప్పించి సెట్స్ మీద వరకు తీసుకెళ్లలేకపోయారు. కానీ ఫైనల్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం నాని ని ఒప్పించాడని ఇప్పుడు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

కాగా ఈ దర్శకుడు నుంచి రీసెంట్ గానే “జిగర్ తండా డబుల్ ఎక్స్” తమిళ నాట వచ్చి మంచి హిట్ అయ్యింది. ఇవే కాకుండా రజినీకాంత్ తో “పేట”, ధనుష్ తో జగమే తంత్రం అలాగే విక్రమ్ తన కొడుకుతో “మహాన్” అనే క్రేజీ గ్యాంగ్ స్టర్ డ్రామా లాంటి చిత్రాలు తాను చేసాడు. అందుకే ఈ కాంబినేషన్ పట్ల ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.