పవిత్ర బంధం సినిమాని తలపిస్తున్న నరేష్ పవిత్రల బంధం.. వీరి బంధం మధ్య భారీ అగ్రిమెంట్?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ నటుడు నరేష్ పవిత్ర రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున మీడియా ఫ్రంట్ లైన్ లో వీరి పేర్లు మారుమోగిపోయాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరొక నటి తో ఎలా రిలేషన్ కొనసాగిస్తారని తనని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ పెద్ద ఎత్తున వివాదానికి తెర లేపారు.ఇలా రమ్య నరేష్ పవిత్ర గురించి ఆరోపణలు చేయడం నరేష్ రమ్య రఘుపతి గురించి ఆరోపణలు చేయడంతో కొద్దిరోజుల పాటు ఈ ముగ్గురు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

ఇకపోతే తాజాగా నరేష్ పవిత్ర రిలేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏకంగా పవిత్ర బంధం సినిమాని తలపించేలా ఉందని తెలుస్తోంది.నరేష్ పవిత్ర రిలేషన్ లో ఉన్నప్పటికీ వీరి మధ్య ఓ అగ్రిమెంట్ నడుస్తుందని ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల నరేష్ పవిత్ర లోకేష్ కు 25 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని అగ్రిమెంట్ లో ఉన్నట్టు సమాచారం.

ఇది మాత్రమే కాకుండా భవిష్యత్తులో నరేష్ ఒకవేళ పవిత్ర లోకేష్ ను వదిలించుకోవాలని ప్రయత్నాలు కనకచేస్తే ఏకంగా తనకు 50 కోట్ల రూపాయల భరణం చెల్లించాల్సి ఉంటుందని ఈ అగ్రిమెంట్ లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.మరి నరేష్ పవిత్ర మధ్య ఉన్న అగ్రిమెంట్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవిత్ర నరేష్ ల బంధం ఏకంగా సౌందర్య వెంకటేష్ నటించిన పవిత్ర బంధం సినిమాని తలపిస్తుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.