Sunny Leon : విష్ణుతో సినిమా కు సన్నీ లియోన్ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

Sunny Leon : సన్నీ లియోన్ బాలీవుడ్ లోనే కాదు సౌతలోనూ చాలా క్రేజ్ ఉన్న బ్యూటీ. తెలుగులో మనోజ్ తో కరెంటు తీగ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన క్రేజ్ మాత్రం పెంచుకుంది. ఇక ఆ తర్వాత గరుడ వేగా సినిమా లో ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును పిచ్చెక్కించింది.ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. తాజాగా మంచు విష్ణు నటిస్తున్న గాలి నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మంచు విష్ణు తన సొంత బ్యానర్లో ‘గాలి నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో రేణుక అనే ఎన్నారై పాత్రలో సన్నీలియోన్ కనిపించనుంది. మొన్న మధ్య సోషల్ మీడియా వేదిక సన్నీ ఈ సినిమాలో తన పాత్రను పరిచయం చేసింది. ఇక ఈ సినిమా కోసం సన్నీ 20 రోజుల డేట్స్ ఇచ్చారట. ఇందుకోసం ఈ అమ్మడికి భారీ పారితోషకం ఇస్తున్నారని తెలుస్తుంది. 20 రోజులకు గాను సన్నీకి రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. సన్నీకి ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు దాంతో ఈ సినిమాకు ఆమె ప్లెస్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తొలుత సాయిపల్లవి ని హీరోయిన్ గా అనుకున్న రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో పాయల్ రాజ్ పుత్ తో సరిపెట్టుకున్నారు.ఇక సొంత బ్యానర్ లో విష్ణు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.చూడాలి మరీ విష్ణు కు గాలి నాగేశ్వర్ రావ్ విజయాన్ని ఇస్తుందో లేదో.