27 ఏడేళ్ల తర్వాత సేనాపతిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు కమల్‌హాసన. ఆయన హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ‘ఇండియన్ (భారతీయుడు`ఎనిటతిజీని `2) అప్పట్లో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇండియన్`2 వస్తోంది.
‘భారతీయుడు’ చిత్రంలో సేనాపతిగా కమల్ ఎంతటి పవర్‌ఫుల్ రోల్ చేశారో.. ఇప్పుడు అంతకుమించి ఆ పాత్రను తీర్చిదిద్దుతున్నారు శంకర్. అయితే సినిమా ప్రకటించి ఐదేళ్లు దాటింది. పలు కారణాల చేత షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా శంకర్ పూర్తిగా ఈ చిత్రం విూదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని లోలా వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్‌కు సంబంధించి శంకర్ ఓ పోస్ట్ పెట్టారు. ఆదివారం ఈ సినిమాకు సంబంధించి పెద్ద అప్‌డేట్ రాబోతుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ అప్‌డేట్ ఏంటా? అని అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్, టీజర్ లాంటిది ఏమైనా ప్లాన చేశారా అని నెట్టింట బ్రౌజ్ చేయడం మొదలుపెట్టారు.
మరి ఆ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే ఆదివారం ఉదయం 11 గంటల వరకూ వేచి చూడాల్సిందే! ఈ చిత్రంలో కాజల్, రకుల్, ప్రియా భవానీ శంకర్, సిద్దార్థ్ గుల్షన గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన స్వరకర్త. లైకా ప్రొడక్షన్స పతాకంపై సుభాస్కరన భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.