మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. చిరుత సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆ సినిమా మంచి హిట్ అవటంతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా విడుదలై రామ్ చరణ్ ని మెగా పవర్ స్టార్ గా మార్చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా కొంత నిరాశ పరిచింది. ఆతర్వాత గోవిందుడు అందరివాడేలే, రంగస్థలం, ధృవ వంటి సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా ద్వారా ఇద్దరు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల రామ్ చరణ్ కి ఒక ఇంట్రెస్టింగ్ టాగ్ ఇచ్చింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన గుర్తింపు పొందిన సమంత బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.
పుష్ప సినిమాతో సమంతకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అమ్మడు బాలీవుడ్ లో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొనింది. ఈ షో కి ఫాస్ట్ గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ సమంతకి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు వేసాడు. ఈ క్రమంలో సమంత విడాకుల గురించి కూడా అడగగా సమంత చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. అంతే కాకుండా టాలివుడ్ స్టార్ హీరోల గురించి కరణ్ అడిగిన దానికి వారికి ఇంట్రెస్టింగ్ ట్యాగ్స్ ఇచ్చింది. ఈ క్రమంలో రామ్ చరణ్ కి ‘ఓ జి ‘ అనే ట్యాగ్ ఇవ్వగా.. అల్లుఅర్జున్ కి మ్యాజిక్ అనే ట్యాగ్ ఇచ్చింది. అయితే ‘ఓజి ‘ అనే పదానికి అర్థమేమిటో తెలియక అభిమానులు గూగుల్ లో సెర్చ్ చేయగా ఓజీ అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టార్’ అర్థం తెలిసింది.