Bigg boss 4: ఈ వారం హోస్ట్ సమంతనే… ఇది ఫిక్స్.. ఇదిగో ప్రోమో

samantha akkineni to host bigg boss show tomoroow 6 pm

తెలుగు రాజ్యం ముందే చెప్పింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావట్లేదు. సమంత వస్తోందని. చెప్పినట్టుగానే జరిగింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావడం లేదు. నాగ్ కోడలు, ప్రముఖ హీరోయిన్ సమంతనే ఈ వారం బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వచ్చింది.

samantha akkineni to host bigg boss show tomoroow 6 pm
samantha akkineni to host bigg boss show tomoroow 6 pm

దానికి సంబంధించిన ప్రోమోను కూడా బిగ్ బాస్ యాజమాన్యం తాజాగా విడుదల చేసింది. ప్రోమోలో సమంతను చూసి షాక్ అవ్వాల్సిందే. పట్టుచీర కట్టుకొని పదహారణాల తెలుగు అమ్మాయిలా ఉంది సమంత. 

రావడం రావడమే నేను నాగార్జునను అంటూ పంచ్ వేసింది సమంత. వెంటనే వీడియోలో నాగార్జున.. ఏయ్.. ఏయ్.. అనగానే.. మామయ్య.. కోడలుపిల్ల సమంత అంటూ బాగానే మేనేజ్ చేసింది సమంత. ఈరోజు నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు అంటూ సమంత హౌస్ మెట్స్ తో అనడం.. హౌస్ మెట్స్ సమంతను చూసి ఒక్కసారిగా అవాక్కవడం.. అసలు బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా.

అయితే.. శనివారం హోస్ట్ ఎవరు రానప్పటికీ.. ఆదివారం దసరా సందర్భంగా సాయంత్రం 6 గంటలకే దసరా స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఉండనుంది. సాయంత్రం 6 నుంచి 9 వరకు ఎపిసోడ్ ప్రసారం కానుంది.

#Samantha tho enjoyment mamooluga undadu...#Dussehra special #BiggBossTelugu4 tomorrow at 6 PM