టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఆమేనా.?

నేనే నెంబర్ వన్.! ఔను, ఈ పాట పాడుకుంటోందిట అందాల భామ శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల చేస్తున్నన్ని సినిమాలు తెలుగులో ఏ ఇతర హీరోయిన్ కూడా చేయడం లేదు. ఇంతకీ, రెమ్యునరేషన్ పరంగా టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు.? అంటే, రష్మిక – పూజా హెగ్దేల చుట్టూ తిరుగుతోంది మీటర్.!

సమంత, కీర్తి సురేష్.. వీళ్ళంతా వేరే లీగ్‌లో పడిపోయారు. ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల ఇమేజ్ ఎక్కడికో పెరిగిపోయింది. సౌత్, నార్త్ షటిల్ చేయడంలో నలిగిపోతున్నారు పూజా హెగ్దే, రష్మిక మండన్న.

శ్రీలీల మాత్రం కన్నడ సినిమాలు వదిలేసుకుని, పూర్తిగా తెలుగు సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. అదే ఆమెుకు అడ్వాంటేజ్ అయి కూర్చుంది. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. కమర్షియల్‌గా బంపర్ హిట్ అయితే, శ్రీలీల నెంబర్ వన్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.! తేడా కొడితేనో.. అంతే సంగతులు.!