సమంత ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్యకు విడాకులిచ్చి ఒంటరిగా జీవితంలో తన ప్రయాణం మొదలు పెట్టింది. ఇలాఈమె విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడంతో వీరు విడాకులకు కారణం ఏంటి అనే విషయం గురించి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే సమంతకు సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టం అక్కినేని కుటుంబం సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టడం వల్ల ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమైందనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే సమంతకు వృత్తిపరమైన జీవితం కన్నా వ్యక్తిగత జీవితమే ఎంతో ముఖ్యమని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. ఈ సినిమా 2019 వ సంవత్సరంలో ప్రకటించి ప్రొడక్షన్ పనులను జరుపుకున్నారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారనే విషయం కూడా మనకు తెలిసింది. అయితే ముందుగా ఈ సినిమాలో నటించే అవకాశం సమంతకు వచ్చింది.
ఈ సినిమాలో సమంత అయితే బాగుంటుందని దర్శకుడు సమంతనే సంప్రదించగా తాను అక్కినేని కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి తాను బాలీవుడ్ సినిమాలలో నటించానని సున్నితంగా ఈ సినిమాకి నో చెప్పింది. అప్పటికి సమంతకు వివాహం జరిగి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఇలా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ సమంత మంచి ఆఫర్ వదులుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే సమంత విడాకులకు మరేదో కారణం ఉందని అర్థమవుతోంది.