త్వరలో అక్కినేని ఫ్యామిలీ గురించి అన్ని విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌నున్న స‌మంత?

అక్కినేని నాగ చైతన్యం ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సమంత, పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకుని అందర్నీ షాక్ కి గురి చేసింది. సమంత ఎక్సపోసింగ్ చెయ్యడం, అలాగే వద్దన్నా వినకుండా ఫామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటించడం వలనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, దాని వల్లే విడాకులకు దారి తీసిందని వార్తలు వచ్చాయి, కానీ దీని పై ఎలాంటి క్లారిటీ లేదు.

వీలు చిక్కినప్పుడల్లా అంతా అక్కినేని ఫామిలీ దే తప్పు, తాను కేవలం బాధితురాలునని సమంత అనేక సార్లు చెప్పింది. కానీ నాగ చైతన్య కానీ అక్కినేని ఫామిలీ కానీ దీని పై స్పందించలేదు.

తాజా సమాచారం ప్రకారం సమంత అతి త్వరలో అక్కినేని ఫామిలీ ని గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడిస్తుందంట. దీపావళి  తర్వాత నుంచి సమంత తన కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.