ట్రోల్స్ పై ఎమోషనల్ నిజాన్ని చెప్పిన సాయి ధరమ్ తేజ్.!

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఎందరో టాలెంటెడ్ హీరోస్ లో అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్స్ అందుకొని ఓ స్టేజ్ కి వెళ్తాడు అనుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. అయితే తాను మళ్ళీ ట్రాక్ తప్పి హిట్స్ అందుకోవడానికి సమయాన్ని తీసుకున్నాడు.

ఇక మళ్ళీ ఈ సమయంలో తన జీవితంలో ఓ ఊహించని మలుపు యాక్సిడెంట్ రూపంలో తిప్పేసింది. దీనితో సాయి ధరమ్ తేజ్ లైఫ్ లో చాలా మార్పు వచ్చింది. అయితే ఆ సమయంలో ఏకంగా పవన్ బయటకి వచ్చి మాట్లాడ్డం పెను సంచలనంగా అయితే మారింది.

మరి ఇప్పుడు తాను నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “విరూపాక్ష” రిలీజ్ కి దగ్గర పడుతూ ఉండగా ప్రమోషన్స్ ని తాను స్టార్ట్ చేసాడు. అయితే ఈ ప్రమోషన్స్ లో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అయితే తనకి యాక్సిడెంట్ అయ్యాక తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించాడు.

తాను రికవర్ అయ్యాక నేను మాట్లాడే మాటలు విని చాలా మంది చాలా మాటలు అన్నారని తాగి మాట్లాడుతున్నానని అనేవారని కానీ నిజానికి నాకు యాక్సిడెంట్ అయ్యాక మాట పోయింది అని మళ్ళీ నాకు మాటలు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అని కానీ దానిని కూడా జోక్ చేసి మాట్లాడ్డం చాలా బాధ కలిగించింది అని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. ఇది మాత్రం చాలా మందికి తెలియనిది ఒకరి లోపం పట్ల తెలియకుండా ఒక మాట అనేయడం అనేది మరింత బాధాకరం అని చెప్పాలి.