Bad Girlz Trailer : ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.

అయితే ఈ రోజు ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్ర దర్శకుడు మారుతి ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది, ప్రామిసింగ్ గా అనిపించింది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) నాకు చిరకాల మిత్రుడు, ఇండస్ట్రీ లో సాధు జీవి, మంచి సంగీత జ్ఞానం ఉన్నవాడు. తన మొదటి చిత్రం లోని నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం తో మన ముందుకు వస్తున్నాడు.
ఒక మంచి విషయాన్ని కొత్త గా చెప్పడానికి ప్రయత్నం చేసాడు . ఒక ఐదుగురు కొత్త అమ్మాయిలతో సినిమా చేయడం, ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా ని పూర్తి చేయడం తన ప్యాషన్ కి నిదర్శనం. సినిమా టైటిల్ మాత్రానే ‘బ్యాడ్ గాళ్స్’ కానీ సినిమా అంతా పాజిటివ్ గా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదల అవుతుంది, అందరు కష్టపడి పనిచేసారు. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు, ఆడవారికి ఇంపార్టెంట్ ఇచ్చే సినిమా తప్పక ఆడాలి. ఈనాటి ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో తీసిన చిత్రం ఇది. తప్పక చూడండి, ఈ ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రాన్ని ఆదరించండి” అని తెలిపారు.

ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ “మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’. సినిమా చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉంటుంది. ఇటీవల మా చిత్ర టీజర్ ను దర్శకుడు బుచ్చి బాబు సానా గారు విడుదల చేసారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను రాజా సాబ్ చిత్ర దర్శకుడు మారుతి గారు విడుదల చేశారు. ఆయన థియేట్రికల్ ట్రైలర్ ను చూసి చాలా బాగుంది అని కొనియాడారు.
మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. ఇది మంచి ఎంటర్టైనర్ చిత్రం. అనూప్ రూబెన్స్ గారు మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ గారు అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. ఇటీవల విడుదల అయినా ‘ఇలా చూసుకుంటానే’, ‘లేలో’ మరియు బాడ్ గర్ల్స్ టైటిల్ సాంగ్స్ కి మంచి ఆదరణ లభిస్తుంది. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి” అని తెలిపారు.

తారాగణం: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య మరియు తదితరులు
సాంకేతిక బృందం:
దర్శకుడు: ఫణి ప్రదీప్ ధూళిపూడి
బ్యానర్స్: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్
నిర్మాతలు: శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె ఎమ్ కుమార్
సంగీతం: అనూప్ రూబెన్స్
లిరిక్స్: ఆస్కార్ చంద్ర బోస్
సినిమాటోగ్రాఫర్: ఆర్లి గణేష్
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి


