టాలీవుడ్ సినిమా దగ్గర మాస్ చిత్రాలకి ఎప్పుడూ కూడా మంచి ఆదరణే ఉంటుంది. అలాగని ఒకటే రొటీన్ మాస్ గాని చూపిస్తే అది ఏ హీరో సినిమా అయినా కూడా ఆడియెన్స్ అంత ఆసక్తి చూపించరు. అయితే టాలీవుడ్ లో మాస్ విషయంలో సెపరేట్ ట్రాక్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీనులు కూడా ఒకరు.
కాగా పూరి జగన్నాథ్ యంగ్ హీరో రామ్ తో చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అంతే కాకుండా టాలీవుడ్ కి ఒక సరికొత్త మాస్ హీరోని పరిచయం చేసింది. సరే ఈ ఇస్మార్ట్ శంకర్ ని పక్కన పెడితే ఇపుడు వాడి తమ్ముడు అన్నట్టుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ “గాంజా శంకర్” అంటూ కొత్త అవతారం ఎత్తాడు.
దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ కూడా పక్కా మాస్ అవతార్ లోకి మారినట్టుగా తెలిపారు. ఇదిలా ఉండగా దీనితో పాటుగా సినిమా టైటిల్ నుంచే ఇస్మార్ట్ శంకర్ షేడ్స్ లో ఇందులో కనిపిస్తుండగా సినిమాలో తేజ్ యాస తన క్యారక్టరైజేషన్ కూడా అలానే అనిపిస్తున్నాయి.
దీనితో ఇది ఇస్మార్ట్ శంకర్ కి మరో వెర్షన్ లా అనిపిస్తుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాని నెవర్ బిఫోర్ మాస్ డ్రామాలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి ఫైనల్ గా సినిమా టేకింగ్ కూడా అదే విధంగా ఉంటే మాత్రం ఏమి చేయలేం. కాకపోతే చాలా ఏళ్ల తర్వాత ఒక కంప్లీట్ మాస్ సినిమా సాయి ధరమ్ తేజ్ చేస్తున్నాడు కాబట్టి ఏమన్నా అంచనాలు ఉండొచ్చు.