Sridevi Apalla Happy Birthday: ప్రముఖ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్షకుల మన్నలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ హర్ష్ రోషన్, బ్యూటీఫుల్ శ్రీదేవి అపళ్ల జోడీ మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ కోన వెంకట్ ఈ క్రేజీ కాంబోని మన ముందుకు తీసుకొస్తున్నారు. కావ్య, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాతలు.
వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ‘బ్యాండ్ మేళం’ సినిమాకు ‘ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ రోజు పుట్టినరోజుని జరుపుకుంటోన్న శ్రీదేవికి బర్త్‌డేను మరింత కలర్‌ఫుల్‌గా చేయయటానికి మేకర్స్ సినిమా నుంచి బర్త్ డే గ్లింప్స్‌ను విడుదల చేశారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటోంది.
శివరాజు ప్రణవ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు మ్యాంగో మాస్ మీడియా సమర్పణ. సంగీతం, ప్రేమ, భావోద్వేగాల కలయికగా రూపొందుతోన్న ఈ అందమైన కథను సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాటలను రాస్తున్నారు. శివ ముప్పరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా రాశారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సతీష్ ముత్యాల నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ సీనియర్ యాక్టర్ సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు.

అద్భుతమైన నటీనటులు, సాంకేతిక వర్గం కలయికలో సంగీతం, భావోద్వేగాలతో హృద్యమైన రూటెడ్ లవ్‌స్టోరీని రూపొందిస్తున్నామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు: రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు
సాంకేతిక వర్గం:
ఏ కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ: మ‌్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
రచన, దర్శకత్వం: సతీష్ జవ్వాజి
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
పాటలు: చంద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
మార్కెటింగ్: వేక్డౌడ్ మీడియా
పిఆర్ఒ: వంశీ కాకా

