Kokkoroko: ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ‘కొక్కోరొకో’ షూటింగ్ పూర్తి.. 2026లో విడుద‌ల‌

Kokkoroko: యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఆర్‌.వి.ఫిల్మ్ హౌస్‌ను స్టార్ట్ చేసి నిర్మాత‌గా మారారు. అందులో భాగంగా శ్రీనివాస్ వ‌సంత‌ల అనే యంగ్ డైరెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తూ ‘కొక్కోరొకో’ అనే యాంథాల‌జీని రూపొందించారు. ఐదు విభిన్న‌మైన పాత్ర‌ల ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కనుంది.

సినీ ప‌రిశ్ర‌మ‌కు యంగ్ టాలెంట్‌ను ప‌రిచ‌యం చేయాల‌నే ల‌క్ష్యంతో ర‌మేష్ వ‌ర్మ‌… శ్రీనివాస్ వసంత‌ల స్టోరీ టెల్లింగ్ సామ‌ర్థాన్ని గుర్తించి అత‌నికి కొక్కోరొకో సినిమాను తెర‌కెక్కించే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ‘కొక్కోరొకో’ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ డిఫ‌రెంట్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. వినూత్న ఆలోన‌ల‌తో డైరెక్ట‌ర్ శ్రీనివాస్ వసంత‌ల‌.. విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా, బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపి కొక్కోరొకో సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ఓ యూనిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌బోతున్నారు.

ప్ర‌ముఖ రైట‌ర్ జి.స‌త్య‌మూర్తి త‌న‌యుడు.. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్రసాద్ సోదరుడైన ప్ర‌ముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్ జివి సాగ‌ర్ ఈ సినిమాకు డైలాగ్స్ రాశారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాక్షసుడు సినిమా తర్వాత రచయితగా జివి సాగ‌ర్ వ‌ర్క్ చేస్తోన్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ఆకాశ్ ఆర్ జోషి..సంగీతాన్ని లండన్‌కు చెందిన ప్యాష‌నేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ సంకీర్తన్ అందిస్తున్నారు.

ఈ చిత్రానికి రేఖా వర్మ, కురపాటి శిరీష నిర్మాత‌లు. నీలాద్రి ప్రొడక్షన్ సహ నిర్మాత. ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌. ఎడిటింగ్ బాధ్యతలను ప్రవీణ్ పూడి నిర్వహిస్తున్నారు. కొత్త టాలెంట్‌తో పాటు అనుభ‌వ‌మున్న స‌భ్యులు టీమ్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లేన ర‌మేష్ వ‌ర్మ అందించారు.

కొత్తదనం కలిగిన యువ ప్రతిభతో పాటు అనుభవం ఉన్న టెక్నీషియన్ల సమ్మేళనంతో రూపొందుతున్న ఈ సినిమా, తెలుగు సినిమాకు మంచి అదనంగా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసినిమాకు మంచి కథతో పాటు, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేను రమేష్ వర్మ అందించ‌టం విశేషం.

2026లో ‘కొక్కోరొకో’ సినిమా రిలీజ్‌కానుంది.

జగన్ పై పవన్ పైత్యం || Analyst Chinta Rajasekhar About Pawan Kalyan Comments On Ys Jagan || TR