అశ్విని దత్ గారి ద్వారా లాంచ్ కావడం నా అదృష్టం, ఛాంపియన్ తో 100% హిట్ కొడుతున్నాం: ఈవెంట్ లో హీరో రోషన్

Champion : స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు.

ఛాంపియన్ నైట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే మాకు ఎంతగానో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ప్రదీప్ గారు ఈ ప్రాజెక్టు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయనని అప్పుడే డిసైడ్ అయిపోయాను. సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ప్రదీప్ గారి విజన్ ని స్వప్న గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఎందుకంటే స్వప్న గారు పీరియడ్ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్. పీటర్ మాస్టర్, మది గారు, తోటగారు అందరు కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. పీటర్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. ఆయనతో మళ్లీమళ్లీ యాక్షన్ సీన్లు చేయాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు పదేళ్ల క్రితం నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జీకే మోహన్ గారు కూడా ఎప్పుడు నాతోనే ఉంటారు. వారికి ధన్యవాదాలు. బైరాన్ పల్లి వీరులందరికీ థాంక్యూ. వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు .ఎడిట్ చూశాను. అందరు కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వైజయంతిలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వైజయంతి మూవీస్, స్వప్న, ప్రియాంక అక్క థాంక్యూ సో మచ్. దత్ గారు లెజెండ్రీ ప్రొడ్యూసర్. ఎంతో మందిని మన ముందుకు తీసుకువచ్చారు. ఎంతోమంది హీరోలని లాంచ్ చేశారు. నన్ను కూడా ఛాంపియన్ ద్వారా తీసుకొస్తున్నందుకు థాంక్యూ.

అమ్మ నాన్న కష్టాన్ని నమ్ముకో అని నేర్పించారు. అలాగే దేని మీద కష్టపడతామో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మూడేళ్లు ఒక ప్రాజెక్ట్ కోసం ఆగాను అంటే అది కేవలం ఛాంపియన్ కోసమే. నేను ఇంకా ఏదైనా మంచి ప్రాజెక్టు వస్తే దానికి ఏదైనా ఇవ్వడానికి రెడీ. నేను సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు కానీ చేసిన ప్రతి సినిమా 100% ఇచ్చానని మీతో అనిపించుకునేలా చేస్తాను. మీ నమ్మకమే నా రియల్ సక్సెస్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థాంక్యూ సో మచ్. మొన్నటి వరకు వచ్చిన టెన్షన్ ఉండేది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఎడిట్ చూసిన తర్వాత 100% హిట్ కొడతామని నమ్మకం వచ్చేసింది. నేను భవిష్యత్తులో ఏదైనా తప్పు చేస్తే మీరందరూ నన్ను తిట్టుకోవచ్చు కానీ డిసెంబర్ 25న మీకు ఆ అవకాశం ఇవ్వను. అందరూ డిసెంబర్ 25న ఛాంపియన్ చూడండి. అందరు ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్యు సో మచ్.

హీరోయిన్ అనస్వర మాట్లాడుతూ... హలో విశాఖపట్నం. విశాఖపట్నం నాకు ఎంతగానో నచ్చింది. డిసెంబర్ 25న ఛాంపియన్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా ఇది. డైరెక్టర్ ప్రదీప్ గారికి థాంక్యూ. స్వప్న గారు ప్రియాంక గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. స్వప్న సినిమాస్ వైజయంతి మూవీస్ లాంటి లెజెండ్రీ బ్యానర్లో నేను తెలుగులో లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. గిరగిర సాంగ్ నా కెరీర్లో గుర్తుండిపోతుంది. మా టీంలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రోషన్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. డిసెంబర్ 25 తర్వాత రోషన్ ని అందరూ ప్రేమిస్తారు. తను కచ్చితంగా చాంపియన్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు చంద్రకళ. తెలుగు ఆడియన్స్ నా మలయాళ సినిమాలు చూసి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఎప్పటిలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. డిసెంబర్ 25న తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

రామ్ మిరియాల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. గిరగిరా అద్భుతమైన పాట. ఈ సినిమా పేరుకు తగ్గట్టు ఇందులో ఉండే మ్యూజిక్ విజువల్స్ పాటలు అన్నీ ఛాంపియన్ లెవెల్. ఈ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిక్కీ గారికి శ్యామ్ గారికి థాంక్యూ. ఈ పాటకి అందం అద్దింది రోషన్ అనస్వర. అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. గిరగిర సాంగ్ కి 50 వేల రీల్స్ వున్నాయి. రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్. మీ అందరికీ థాంక్స్ చెప్పడానికి ఈ వేదిక మీదకు వచ్చాను. ఈ పాటకి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. పాటని అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మిక్కీ మేయర్ గారి అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. రామ్ గొంతులో ఆ మట్టి వాసన అద్భుతంగా పలికింది. డైరెక్టర్ ప్రదీప్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీకాంత్ గారి మహాత్మ సినిమాలో నీలపురి సాంగ్ రాశాను. ఆ పాట నాకు విసిటింగ్ కార్డుగా మారింది. ఇప్పుడు ఛాంపియన్ లో గిరగిరా పాట రాశాను.ఈ పాట ఈ సినిమాకి ఒక విసిటింగ్ కార్డులకు మారింది.అశ్విని దత్ గారికి స్వప్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు.ఈ సినిమా చాలా అద్భుతమైన విజయాన్ని అందుకుని అందరికీ గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

రచ్చ రవి మాట్లాడుతూ.. ఛాంపియన్ ఒక అద్భుతమైన చరిత్ర. మనందరికీ చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా. స్వప్న గారితో వర్క్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వైజయంతి మూవీస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన చరిత్ర గల బ్యానర్. ఇండస్ట్రీకి ఎంతో మంది సూపర్ స్టార్ పరిచయం చేసిన సంస్థ. రోషన్ కూడా సూపర్ స్టార్ కాబోతున్నాడు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

ఊహ మాట్లాడుతూ.. హలో వైజాగ్. అందరికీ నమస్కారం. రోషన్ మూడేళ్లు ఎదురు చూశాడు. దానికి ఆన్సర్ గా ఈ సినిమా మీరు చూస్తున్నారు. మైఖేల్ గా తనకి అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్యూ. దత్ గారు కిరణ్ గారు అందరూ రోషన్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాళ్ళ సంస్థలో రోషన్ రీలాంచ్ అవడం ఆనందంగా వుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

యోగి బెస్ట్ బాబు వేస్ట్ || Ks Prasad Fires On Pawan Kalyan Comments On Ys Jagan || Chandrababu || TR