ఈసారి ఇంకా పవర్‌ఫుల్ రోల్.!

‘భీమ్లానాయక్’ సినిమాతో అనూహ్యంగా స్టార్‌డమ్ సంపాదించుకుంది సంయుక్త మీనన్. ఆ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా, ఆ పాత్రతో గట్టి ఇంపాక్ట్ వేసింది. వాస్తవానికి, ఆ సినిమా కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘బింబిసార’.

‘బింబిసార’లో సంయుక్త హీరోయిన్ అయినా, అది ఆమెకు నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమా సక్సెస్, హీరోయిన్ ప్చ్.. మంచి పాత్రలో కనిపించలేదన్న భావన చాలామందిలో వచ్చింది.

ఇక, ‘విరూపాక్ష’ మాత్రం, సంయుక్త మీనన్‌కి భలే స్టార్‌డమ్ తెచ్చింది. నటిగా తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఆ సినిమా బాగా ఉపయోగపడింది సంయుక్తకి. ఈసారి అంతకు మించిన ప్రశంసలు ‘డెవిల్’ సినిమాతో దక్కించుకోనుందట సంయుక్త.

సినిమాలో తొలుత అనుకున్న పాత్ర నిడివి కంటే, ఆ తర్వాత బాగా పెంచారనీ, సంయుక్త నటనా ప్రతిభను ఈ సినిమా మరింత గొప్పగా చాటుతుందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఓ దశలో హీరోని హీరోయిన్ డామినేట్ చేసేస్తుందట కూడా.! ఈ విషయంలో కళ్యాణ్ రామ్, సంయుక్తకి అండగా నిలిచాడట.