Sai Pallavi: కాశీ యాత్రలో సాయి పల్లవి.. అన్న పూర్ణాదేవిని దర్శించుకున్న లేడి పవర్ స్టార్!

Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాయి పల్లవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఇటీవలే సాయి పల్లవి అమరన్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సాయి పల్లవిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది సాయి పల్లవి. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో మునిగితేలుతోంది నాచురల్ బ్యూటీ. తాజాగా ఆమె కాశికి వెళ్లి అక్కడ అన్నపూర్ణ దేవిని దర్శించుకుంది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ లో బ్లూ కలర్ సల్వార్ సూట్, దుపట్టా, మెడలో బంతిపూల హారం, చేతికి రుద్రాక్షల దండతో అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి.

ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ లేడి పవర్ స్టార్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తారు. ఇకపోతే సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో భాగంగానే నాగ చైతన్యతో కలిసి ఆమె నటిస్తున్న తండేల్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమాలో సీత పాత్రలో నటిస్తోందీ సాయి పల్లవి. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి భాగం 2026 లో దీపావళికి, రెండో భాగం 2027లో వచ్చే దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.