నానితో నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న RRR నిర్మాతలు..!

టాలీవుడ్ టైర్ 2 హీరోస్ లో నెంబర్ 1 హీరో అయినటువంటి నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు హాయ్ నాన్న అనే తన కెరీర్ 30వ స్పెషల్ ప్రాజెక్ట్ ని చేస్తుండగా ఈ సినిమా తర్వాత అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఐతే భారీ సినిమాని తాను అనౌన్స్ చేసాడు.

కాగా ఈ చిత్రం కోసం నిన్ననే మేకర్స్ బిగ్ అప్డేట్ ని అందించగా ఈ అప్డేట్ తో అయితే ఏకంగా RRR నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ ఈరోజు అప్డేట్స్ తో అయితే ఓ గ్రాండ్ లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా దీనితో అర్ధం అవుతుంది.

తమిళ నుంచి వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మురళి జి అలాగే రీసెంట్ మ్యూజిక్ సెన్సేషన్ జేక్స్ బిజోయ్ సహా ప్రముఖ ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ లు ఐతే ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

దీనితో అసలు ఈ సినిమాని మాత్రం చాలా గ్రాండ్ గా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్ధం అవుతుంది. కాగా వీరిలో సంగీత దర్శకుడు పలు భారీ చిత్రాలు కింగ్ ఆఫ్ కొత్త ఇంకా చాలానే సినిమాలకి క్రేజీ మ్యూజిక్ అందించగా కార్తీక శ్రీనివాస్ అయితే ఐ మనోహరుడు, పుష్ప 1, పుష్ప 2 అలాగే 1 నేనొక్కడినే సహా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ భారీ సినిమాలకి వర్క్ చేశారు.

ఇప్పుడు నానితో మొదటిసారి చేయబోతున్నాడు. ఇక ఇవన్నీ వింటేనే సినిమాపై మంచి హైప్ నమోదు అయ్యింది. ఇక ఈ 24న అయితే సినిమా గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. మరి మేకర్స్ అంతా ఏం కుక్ చేస్తున్నారో చూడాల్సిందే.