RC16: ఇది నిజం కాదా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా చేయనున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది.

ఈ సినిమాతో వెంకట సతీష్ కుమార్ కిలారు నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఈ ఏడాది ఆఖరిలో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ని త్వరలో రివీల్ చేయనున్నారంట.

ఇప్పటికే బుచ్చిబాబు ఇంటరెస్టింగ్ టైటిల్ ని అన్ని భాషలకి సరిపోయే విధంగా ఫిక్స్ చేసారంట. ఇప్పుడు ఈ టైటిల్ ని బుచ్చిబాబు సానా రివీల్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది. అలాగే మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేస్తారంట. అయితే ఈ టాక్ ఎందుకొచ్చింది అని చూస్తే తాజాగా సోషల్ మీడియాలో ఆర్ సీ 16 కాన్సెప్ట్ పోస్టర్ అంటూ ఒకటి చక్కర్లు కొట్టింది.

ఇది కంప్లీట్ గా ఫ్యాన్ మేడ్ పోస్టర్. ఈ పోస్టర్ ని చూసిన తర్వాత అందరూ రియల్ అని అనుకున్నారు. అయితే పోస్టర్ ఫేక్ అని తరువాత క్లారిటీ వచ్చింది. ఈ పోస్టర్ లోనే ఫస్ట్ లుక్, టైటిల్ త్వరలో ప్రకటిస్తున్నట్లు మెన్సన్ చేశారు. దీంతో నిజంగానే ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలోనే వస్తుందనే ఫ్యాన్స్ కూడా భావించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇది కేవలం గాసిప్ మాత్రమే అని తెలుస్తోంది. ఇంకా బుచ్చిబాబు సానా మూవీకి సంబంధించి క్యాస్టింగ్ కూడా ఫైనల్ కాలేదు. ఇలాంటి టైమ్ లో ఫస్ట్ లుక్ ఎలా రివీల్ చేస్తారనేది కొంతమంది ఫ్యాన్స్ ప్రశ్న. మరి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా చిత్ర యూనిట్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.