రామ్ చరణ్ మెగా బిజినెస్ ప్లాన్స్.!

ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు వ్యాపార కార్యకలాపాలు.. రెండిటినీ రామ్ చరణ్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడబ్బా.? రామ్ చరణ్ మాత్రమే కాదు, చాలామంది నటీనటులు, సైడ్ బిజినెస్‌లు గట్టిగానే చేస్తున్నారు.

రాను రాను సినిమా పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఏడాదికి ఓ సినిమా చేయడం అగ్ర హీరోలకు కనాకష్టంగా మారుతోంది. సినిమా హిట్టయితే సరే.. ఫ్లాపయితేనో.? అందుకే, సంపాదన విషయంలో ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే.

రామ్ చరణ్ తెలివైనోడు, విమానయాన రంగం సహా.. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. బయటకు తెలిసినవి కొన్నే.. ఇంకా తెరవెనుకాల చాలా వ్యాపారాల్లో రామ్ చరణ్ బిజీగా వున్నాడు. తాజాగా, మాజీ క్రికెటర్ ధోనీతో కూడా వ్యాపార కార్యకలాపాల నిమిత్తం భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

కాదు కాదు.. ధోనీ కూడా సినీ నిర్మాతగా మారిన దరిమిలా, సినిమా కోసమే.. అంటూ ఇంకొందరు చెబుతున్నారు. ఎవరు ఏం చెప్పినా, రామ్ చరణ్ ప్లాన్స్ మాత్రం.. అంత తేలిగ్గా బయటకు రివీల్ అయ్యే అవకాశమే లేదు.

ప్రస్తుతం రామ్ చరణ్, ‘శంకర్’ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమాలో రామ్ చరణ్ నటించాల్సి వుంది.