టైగర్ ష్రాఫ్, రామ్ చరణ్ కాంబినేషన్.?

ట్రెండ్ మారింది.! బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. అన్నీ కలిసిపోయాయ్.! ఇప్పుడంతా ఇండియన్ సినిమానే.! ఇంకా కొందరు బాలీవుడ్ అనీ, టాలీవుడ్ అనీ, కోలీవుడ్ అనీ బౌండరీలు గీసుకోవచ్చుగాక. కానీ, చాలామంది సినీ ప్రముఖులైతే మనది ఇండయన్ సినిమా.. అంటున్నారు.

జూనియర్ ఎన్టీయార్, బాలీవుడ్‌లో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. మూవీ కాదు, మూవీస్.! బ్యాక్ టు బ్యాక్ రెండు స్ట్రెయిట్ హిందీ సినిమాలకు కమిట్ అయ్యాడు జూనియర్ ఎన్టీయార్.! అదిగో మళ్ళీ.. బాలీవుడ్ ఏంటి.? ఇండియన్ సినిమాలని అనాలి.

తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ ఇండియన్ సినిమాకి కమిట్ అయ్యాడట. టైగర్ ష్రాఫ్ ఆ సినిమాలో ఓ హీరో కాగా, చరణ్ ఇంకో హీరో అని అంటున్నారు. కాదు కాదు, టైగర్ ష్రాఫ్ నెగెటివ్ రోల్ చేస్తాడనే ప్రచారమూ జరుగుతోంది.

ఇది జస్ట్ గాసిప్ మాత్రమేనా.? అంటే, కాదు కాదు.. తెరవెనుకాల పెద్ద తలకాయలే వున్నాయ్.. అతి త్వరలోనే గుడ్ న్యూస్ అధికారిక ప్రకటన రూపంలో రాబోతోందని అంటున్నారు.

ఈ మధ్య బాలీవుడ్ ప్రముఖులతో రామ్ చరణ్ బాగా కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ మాటకొస్తే, బాలీవుడ్ సినీ ప్రముఖులే, సౌత్ హీరోలతో బాగా కనెక్ట్ అయిపోతుండడం చూస్తున్నాం. సౌత్ హీరోలు, అందునా తెలుగు హీరోలంటే బాలీవుడ్ సినీ జనాలకు ఒకింత ప్రత్యేకమైన ఇష్టం ఈ మధ్య ఏర్పడింది.

‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’, ‘పుష్ప’ తదితర సినిమాలు, బౌండరీస్ దాటి మరీ సంచనాలు సృష్టించాయ్ మరి.!