పుష్ప 2 సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అందరి అంచనాలను అందుకుంటూ భారీ ఎలివేషన్స్ తో, ఆకట్టుకునే ఫైట్స్ తో మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఈ సినిమాతో మరొకసారి నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అంటున్నారు అతని ఫాన్స్. ముఖ్యంగా జాతర సీన్ హైలెట్ అంటున్నారు. అయితే ఈ సినిమా అంత హిట్ అవ్వటానికి ప్రధాన కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
ఈ సినిమా హిట్ అవ్వటానికి ప్రేక్షకులు ఈ సినిమా మీద అంతగా అంచనాలు పెట్టుకోవడానికి మొట్టమొదటి కారణం పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటన. ఆ నటన ఎలా ఉండబోతుందో చెప్పటానికి జాతర సీన్ ఒక్కటి చాలు. ఆ తర్వాత సినిమాకి అతిపెద్ద హైలెట్ గంగమ్మ తల్లి జాతర సినిమాలో 15 నిమిషాలు ఉండే ఈ సీక్వెల్ ని రెండు నెలల పాటు చిత్రీకరించి 70 కోట్లు ఖర్చు పెట్టారు.
అయినా ఆ కష్టం ఆ ఖర్చు ఆ సీన్ లో కనిపిస్తుంది. సినిమా మొత్తానికి హైలైట్ అనిపించుకుంది. ఇక సుకుమార్ డైరెక్షన్ గురించి వేరే చెప్పనవసరమే లేదు మొదటి పార్ట్ లో చాలా చిక్కుముడులు వేసి వాటికి రెండో పార్టీలో క్లారిటీ ఇవ్వటంలో సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాకి అల్లు అర్జున్ యాక్టింగ్ యాక్షన్ సీన్స్ తో పాటు అతిపెద్ద హైలెట్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.
పుష్ప 2 మొదటి గ్లింప్స్ కి దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదు. అలాగే సినిమాలో సాంగ్స్ మొత్తం హైలెట్ కావటం విశేషం. ఇక ఇందులో కిసక్ సాంగ్ కి శ్రీ లీల వేసిన డాన్స్ మరొక హైలెట్. ఫైనల్‌గా ఫ్యామిలీ సెంటిమెంట్ మరో హైలైట్‌గా చెప్పాలి. ఆడబిడ్డ పుట్టాలని బన్నీ చేసే డాన్స్, ఈ క్రమంలో రష్మికతో వచ్చే సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయి.