ఆ అనుభూతి మాటలలో చెప్పలేనిది: పూజా హెగ్డే

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు సంపాదించుకున్న నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వరస సినిమాలతో దూసుకుపోతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వరస ఫ్లాప్ సినిమాలు వస్తున్నప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికే ఈమె రెండు తెలుగు సినిమాలతో పాటు రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే పూజ హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఒక సంఘటన మాత్రం తనకు ఎంతో అనుభూతిని కలిగించిందని అలాంటి అవకాశం వచ్చినందుకు తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇంతకీ ఆ అదృష్టం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈమె బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తో కలిసి ఒక కూల్ డ్రింక్ యాడ్ లో నటించారు.

అమితాబచ్చన్ తో కలిసి మాజా కూల్ డ్రింక్ యాడ్ లో కలిసిన నటించిన ఈమె తాజాగా ఈ విషయంపై స్పందించారు. అమితాబచ్చన్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాలాంటి వారికి అమితాబచ్చన్ గారు గురువు లాంటి వారు. ఈ వయసులో కూడా ఆయన సమయపాలన అతని డెడికేషన్ నన్ను ఎంతగానో కదిలించాయి.ఇక ఆయనకి మనవరాలిగా నటిస్తున్న సమయంలో నేను ఎంతో అనుభూతి చెందానని ఈ సందర్భంగా పూజ హెగ్డే అమితాబ్ తో కలిసి నటించిన విషయం గురించి గుర్తు చేసుకున్నారు.