“RRR” తో ఇప్పుడు ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ భారీ గుర్తింపు.!

మన తెలుగు సినిమా దగ్గర భారీ స్థాయి క్రేజ్ ఉన్నటువంటి మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. తనపై ఎన్నో రిమార్క్స్ ఉండొచ్చు కానీ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో మాత్రం క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఇలాంటి ఒక హీరో అలాగే మెగా ఫ్యామిలీ నుంచి మరో మంచి మాస్ హీరో రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన మ్యాజికల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). 

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిత్రం ఇద్దరు హీరోలకి కూడా సెన్సేషనల్ రీచ్ అందుకుంది. ఇక ఇప్పుడు అయితే ఎన్టీఆర్ కి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ గుర్తింపు క్రేజ్ లభించింది. ఓ హాలీవుడ్ ప్రముఖుడు ఈ సినిమాలో ఇంటర్వెల్ కి గాను ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ని ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యగా.. 

దానికి అయితే ఏకంగా 10 మిలియన్ కాదు 11 నుంచి ఇంకా భారీ స్థాయిలో కేవలం ఈ ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే వచ్చేసింది. దీనితో ఎన్టీఆర్ కి ఏ లెవెల్ లో గుర్తింపు ఇప్పుడు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఎట్టకేలకు మాత్రం ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ కి ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ అయితే ఎన్టీఆర్ తన మరో దర్శకుడు కొరటాల శివతో మరో భారీ సినిమా చేస్తున్నాడు.