ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ ఆఫర్.. కానీ అక్కడ కూడా సైడ్ రోల్ నా?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన లాస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ గ్లోబల్ హిట్ తో తాను గ్లోబల్ స్టార్ గా ఐతే ఎదిగాడు. ఇక దీని తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈరోజు ఎన్టీఆర్ నుంచి అసలు ఊహించని రేంజ్ సెన్సేషనల్ అప్డేట్ అయితే బయటకి వచ్చింది.

బాలీవుడ్ సినిమాలో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మాసివ్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తో అయితే వారి స్పై యూనివర్స్ లో భాగంగా “వార్ 2” లో తాను నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి వార్ 1 లో అయితే హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ లు నటించగా ఇపుడు పార్ట్ 2 లో అయితే ఎన్టీఆర్ కూడా యాడ్ అవ్వడం ఓ రేంజ్ లో అప్డేట్ గా మారింది.

కాగా ఈ ఊహించని అప్డేట్ అంత బాగానే ఉంది కాని ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమాలో చేసేది కేవలం గెస్ట్ లేదా రెండో హీరో రోల్ లాంటిదే అని టాక్ ఊపందుకుంది. ఎందుకంటే అసలు వార్ సినిమాలో మెయిన్ హీరోనే హృతిక్ రోషన్ అని అందరికీ తెలిసిందే.

దీనితో అలాంటప్పుడు పార్ట్ 2 లో కూడా మెయిన్ హీరో హృతిక్ అవుతాడు తప్ప ఎన్టీఆర్ ఎలా అవుతాడు అని అంటున్నారు. కాకపోతే ఎన్టీఆర్ కి బలమైన పాత్రని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని అయితే “బ్రహ్మాస్త్ర” ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ ఈ సినిమా ఈ ఏడాది చివరలో స్టార్ట్ కానుంది.