సెన్సేషనల్ : పవన్, ఎన్టీఆర్ వల్లే కానిది తేజ సజ్జ కొట్టి చూపించాడు.! 

సినిమా చూసే వారికి బాగానే ఉండొచ్చు కానీ ఆ సినిమా మంచిదో చెడ్డదో కానీ దానిని తీయడానికి చాలా మంది కష్టపడతారు. అలా సినిమానే నమ్ముకొని సినిమాల్లో రాణించాలని హీరోగా అవ్వాలని చాలా మంది అనుకుంటారు కానీ తమ టాలెంట్ తో పాటుగా అదృష్టం హార్డ్ వర్క్ ఉంటే వారికి తప్పకుండ మంచి బ్రేక్ దక్కుతుంది.

ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న హీరో పేరు తేజ సజ్జ. లేటెస్ట్ గా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ఆడియెన్స్ కి బాగా రీచ్ అయ్యాడు. కాగా ఈ చిత్రం తోనే తేజ తన కెరీర్ లో భారీ హిట్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా సక్సెస్ ఏమి అంత సులభంగా తనకి రాలేదు.

సినిమా చేస్తున్నపుడు సినిమా రిలీజ్ చేసే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఫైనల్ గా హనుమాన్ అంశ తోనే భారీ హిట్ కొట్టి ఇప్పుడు టాలీవుడ్ ఒక అరుదైన ఫీట్ ని అందుకున్నాడు. కాగా ఇప్పుడు తేజ సజ్జ టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల షేర్ ఉన్న అతి కొద్ది మంది హీరోస్ లో ఒకడిగా నిలిచాడు.

అయితే ఈ లిస్ట్ లో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ కూడా ఉండగా వారి సరసన 100 కోట్ల షేర్ ఉన్న హీరోగా తేజ ఇప్పుడు నిలిచాడు. అయితే వారిలో చాలా మంది సినిమాల్లో తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం విశేషం.

ఇక ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి హీరోస్ ఇంకా 100 కోట్ల మార్క్ ని టచ్ చెయ్యలేదు. వారి సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన తాను ఇప్పుడు 100 కోట్ల షేర్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ హీరోస్ లో ఒకడిగా నిలవడం విశేషం.