నేషనల్ లెవెల్లో ఎన్టీఆర్ కి అవమానం??

గత కొన్ని రోజులు నుంచి కూడా టాలీవుడ్ సినిమా దగ్గర బాగా వినిపిస్తున్న వార్త ఏదన్నా ఉంది అంటే అది RRR సినిమా విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అలాగే ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ల కోసమే అని చెప్పాలి. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చేసింది సపోర్టింగ్ రోల్ అని చెప్పడమే ఇప్పుడు పెద్ద రచ్చకి దారి తీసింది.

దీనితో ఈ అంశాన్ని నేషనల్ మీడియా కూడా గ్రాబ్ చేసి అటెన్షన్ ని తీసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రని జనం నెత్తిన పెట్టుకుంటే ఎన్టీఆర్ పాత్ర అందుకు చాలా బాగా సపోర్ట్ ని అందించింది అని మేకర్స్ విజయేంద్ర ప్రసాద్ తెలుపగా.. రామ్ చరణ్ మరియు మెగా అభిమానులు ఈ టాక్ ని పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో ఎన్టీఆర్ ది ఈ సినిమాలో మరోసారి జస్ట్ సపోర్టింగ్ పాత్రే అనే మాట మళ్ళీ రిలీజ్ తర్వాత రోజు వచ్చిన టాక్ రేంజ్ లో ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది.

దీనితో ఇదే అదునుగా నేషనల్ మీడియా కూడా ఎన్టీఆర్ చేసింది సపోర్టింగ్ రోల్ అంటూ విజయేంద్ర ప్రసాద్ విషయంలో ఆర్టికల్స్ స్టార్ట్ చేయడంతో దానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి భారీ రీచ్ వస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోపై ఈ రేంజ్ నెగిటివ్ చూస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే అసలు ఈ ఇష్యూ అంతా ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి మార్.