గ్లింప్స్ టాక్ : క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న నాని “సరిపోదా శనివారం”

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం హాయ్ నాన్న తర్వాత తన కెరీర్ లో 31వ చిత్రం అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని తమ కాంబినేషన్ లో రెండో సినిమాగా చేస్తుండగా ఈ సినిమాని అయితే చిత్ర యూనిట్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా నిన్నటితో కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈరోజు అయితే ఓ క్రేజీ ట్రీట్ నే అందించారని చెప్పొచ్చు. కాగా “సరిపోదా శనివారం” అంటూ టైటిల్ తో నానిపై రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ సినిమాపై అందరిలో ఆసక్తి రేపింది. సాయి కుమార్ బేస్ వాయిస్ ఓవర్ లో స్టార్ట్ అయ్యిన ఈ వీడియోలో సినిమా కాన్సెప్ట్ రివీల్ చేశారు.

ఆ తరం అయినా ఈ తరం అయినా నీకంటూ ఒకరోజు వస్తుంది దానికోసం వెయిట్ చెయ్ అనేది వింటూ ఉంటాం కానీ ఆ ఒకరోజు ప్రతి వారంలో శనివారం ఒకడికి వస్తే? ఆ ఒకడు ఏం చెయ్యగలడు అనే క్రేజీ కాన్సెప్ట్ లో అయితే ఈ వీడియో కనిపిస్తుంది.

అప్పటికే తనని సంకెళ్లు తాళ్లతో బంధించిన నాని మరోపక్క గడియారంలో ముళ్ళు 12 శుక్రవారం నుంచి శనివారం కి మారుతుంది. ఆ ఒక్కరోజు తనలో కలిగే చేంజ్ షేడ్ ని కేజ్రీగా చూపించారు. మొత్తానికి అయితే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో నాని రాబోతున్నాడని చెప్పాలి. కాగా ఈ చిత్రం రేపు అక్టోబర్ 24 న ముహూర్తంతో ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ కానుంది. 
https://x.com/DVVMovies/status/1716344122968289296?s=20