ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు మంచి ఆసక్తిగా మారుతున్న సూపర్ థ్రిల్లర్ మరియు ఎమోషనల్ కంటెంట్ తో అయితే సినిమాలు తెరకెక్కుతూ ఉండగా యంగ్ దర్శకులు తమ టాలెంట్ తో అయితే మెస్మరైజ్ చేస్తున్నారు. అలాగే పలు మల్టీ స్టారర్ చిత్రాలు కూడ మరింత ఆసక్తిగా మారుతూ ఉండగా.
లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ టాలీవుడ్ లో కనపడనున్నట్టుగా క్రేజీ బజ్ తెలుస్తుంది. ఇంకా దీని డీటెయిల్స్ లోకి వెళితే నాచురల్ స్టార్ నాని అయితే వెంకీ మామ నటిస్తున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఏక్షన్ చిత్రం “సైంధవ్” లో అయితే కనిపించనున్నట్టుగా కన్ఫర్మ్ అయింది.
అయితే ఇదెలా అంటే ఈ సినిమాని నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాతో “హిట్” అనే ఫ్రాంచైజ్ ని పరిచయం చేసిన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో నాని కనిపించనున్నట్టుగా ఇపుడు నిర్ధారణ అయ్యింది.
నిన్న నాని నటిస్తున్న 30వ సినిమాని ఈ డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ రాగా దీనిపై శైలేష్ స్పందిస్తూ ఈ ఏడాది క్రిస్మస్ కి నాని నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి రెండు కూడా హిట్స్ అవుతాయి అని ట్వీట్ చేసాడు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ మల్టీ స్టారర్ లాక్ అయ్యిందని ఫ్యాన్స్ లో కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇది కూడా హిట్ యూనివర్స్ కి ఏమన్నా లింక్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Ee Christmas ki @NameisNani bro vi rendu movies okesari release 🙂 Rendu hit le 🙂 All the best Nani bro 🙂 https://t.co/H9Hho0eltJ
— Sailesh Kolanu (@KolanuSailesh) April 15, 2023