Tollywood: ఈ టాలీవుడ్ సీనియర్ హీరోలు ఒక్కో మూవీకి ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారో తెలుసా?

Tollywood: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నలుగురు హీరోలు ప్రస్తుతం ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఈ నలుగురు హీరోలలో బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించడంతోపాటు హ్యాట్రిక్ ను అందుకొని వర్షం సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.

కేవలం సినిమాలో నటించడం మాత్రమే కాదండోయ్ ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ సీనియర్ హీరోలు ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అన్న విషయానికి వస్తే.. నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరొకవైపు రాజకీయ నాయకుడుగా కూడా రాణిస్తున్నారు. ఈయన ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 15 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారు. సినిమా, సినిమాకు తన రెమ్యూనరేషన్ ని అంతకంతకు పెంచుతూ పోతున్నారు బాలయ్య బాబు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే..

ప్రస్తుతం చిరంజీవి ఒక సినిమాకు 40 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నారు. అక్కినేని నాగార్జున ఒక్కో చిత్రం కోసం దాదాపు రూ. 7 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న వెంకటేష్ ఈ సినిమాకు గాని 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది.