Ram Charan–NTR: మళ్లీ కలుసుకున్న తారక్,చెర్రీ.. పాన్ ఇండియా స్టార్స్ తో తమన్.. ఫొటోస్ వైరల్!

Ram Charan–NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ఈ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అభిమానికి తెలిసిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ చెర్రీ తారక్ ల మధ్య ఇంత మంచి స్నేహబంధం ఉందా అని ఆశ్చర్యపోయారు. అయితే ఈ సినిమా సమయంలో ఎక్కడ చూసినా కలిసి కనిపించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఆస్కార్ అవార్డు వేడుకల తర్వాత మళ్లీ ఎక్కడ కనపడలేదు. అయితే ఇప్పుడు తాజాగా చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి ఒక చోట కనిపించారు.

దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరితోపాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. అతను మరెవరో కాదు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు తమన్. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. దోప్ మూమెంట్. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. నిన్న గేమ్ చెంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరిగిన సంగతి తెలిసిందే. చరణ్, తమన్ ఇద్దరూ ఈ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లారు.

ఈ ఫొటో ఇప్పుడు తమన్ షేర్ చేయడంతో ఎన్టీఆర్ కూడా అమెరికాకు వెళ్ళారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా సంక్రాంతి పండుగ పండుగ కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర మూవీ తో ప్రేక్షకులను పలకరించి సూపర్ హిట్ టాక్ ని అందుకోగా ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. ఇప్పటికే తారక్ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయగా ఇప్పుడు చెర్రీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా లేదా అన్నది అభిమానులలో క్యూరియాసిటీని పెంచేస్తోంది.