టాలీవుడ్ మాస్ మూల విరాట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. కాగా ఈ చిత్రంపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఓ అప్డేట్ బయటకి రాగ దీని ప్రకారం అయితే..
ఈ చిత్రం రెండు పాటలు షూటింగ్ ఇంకా మిగుల్చుకోగా ఈ షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి రెడీ అయ్యింది. అయితే ఈ షూట్ సహా మెగాస్టార్ కుటుంబం కూడా విహారయాత్రకు ప్లాన్ చేసుకోగా ఈ సినిమా హీరోయిన్ శృతి హాసన్ కూడా వారితో స్టార్ట్ అయ్యింది. మరి దీనితో అయితే మెగాస్టార్ ఓ ఆసక్తికర పోస్ట్ అందులోని తన మార్క్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.
“ఫ్యామిలీ తో అటు విహార యాత్రహీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర” అంటూ రెండు ఫోటోలు ఒకటి ఫ్యామిలీతో అలాగే మరొకటి రెండో ఫోటో హీరోయిన్ శృతి హాసన్ తో కలిపి పోస్ట్ చేసారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మరి ఈ షూటింగ్ అయితే యూరోప్ లో జరగనుండగా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఫ్యామిలీ తో అటు విహార యాత్ర
హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022