“హనుమాన్ 2” లో మెగాస్టార్..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 

ఇప్పుడు తెలుగు సినిమా సెన్సేషనల్ చిత్రం “హనుమాన్” కొట్టిన రీ సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మలు కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా జాక్ పాటు కొట్టారు.

కాగా ఈ భారీ చిత్రంలో రిలీజ్ కి ఇంకా సమయం ఉందన్న సమయంలో ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నాడు అని హనుమాన్ గా కనిపించేది చిరు నే అంటూ వచ్చిన రూమర్స్ మెగా ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే పని చేసాయి. ఆ సినిమాలో క్లైమాక్స్ వరకు కూడా ఆ అమ్మగా విజువల్ కోసం వెయిట్ చేశారు.

కాగా ఫైనల్ గా యానిమేటెడ్ వెర్షన్ ని చూపించారు. కానీ హనుమాన్ 2 లో మాత్రం హనుమంతుణ్ణి పూర్తిగా చూపించడం కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ చిత్రంలో అయితే మెగాస్టార్ ఉంటారా లేదా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. తాను హనుమాన్ గా మెగాస్టార్ ని చూపించాలి అనుకుంటున్నట్టుగా ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా తెలిపాడు.

దీనితో ఈ జై హనుమాన్ లో చిరు కనిపించేందుకు హై ఛాన్స్ లు ఉన్నాయని చెప్పాలి. కాగా చిరంజీవి గారిని ప్రస్తుతం కలవడం కుదరలేదు అని తప్పకుండ కలిసి తన ఐడియా కోసం మళ్ళీ ఒకసారి చెబుతాను అని తాను తెలిపాడు. దీనితో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో మెగాస్టార్ ఉండేందుకు చాలా హై ఛాన్స్ లు తప్పకుండా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం మెగాస్టార్ అయితే విశ్వంభర సినిమాలో బిజీగా ఉన్నారు.