Rajamouli : 800కోట్ల బడ్జెట్ తో మహేష్ జక్కన్న మూవీ…!

 

Rajamouli: ఈ మధ్యకాలంలో సినిమాల బడ్జెట్లు బాగా పెరిగిపోయాయి. 100 కోట్లు అంటే అది సాధారణ సినిమా అయిపోయింది. ప్రస్తుతం 200 కోట్లు, 500 కోట్లు, వెయ్యి కోట్ల వరకు కూడా నిర్మాతలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. బాహుబలి సినిమా తో బడ్జెట్ సమీకరణ మొత్తం మారిపోయింది. పైగా రాజమౌళి లాంటి దర్శకుడు తీసుకున్న సినిమాకు అయితే నిర్మాతలు బడ్జెట్ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే రాజమౌళి కి పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి ఎలా రాబట్టుకోవాలి బాగా తెలుసు.

ఇవ్వాళ వచ్చిన ఆర్ఆర్ సినిమాకు 500 కోట్లు ఖర్చు పెట్టారట. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది సంగతి తెలిసిందే. ఈ సినిమాను 800 ల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని దర్శకుడు ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కథ ఏంటి..? ఏ జోనర్ తో తెరకెక్కుతోందనే విషయంపై చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. మహేష్ ని రాజమౌళి ‘జేమ్స్ బాండ్’గా చూపిస్తాడని అంటున్నారు. ఇప్పుడు అదే నిజం కాబోతుందని సమాచారం. జేమ్స్ బాండ్ లాంటి కథతోనే రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నారట. దానికి రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. చివరి క్షణాల్లో సినిమా బడ్జెట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా రూ.2000 కోట్లు కాబట్టి.. ఎలాగైనా డబ్బుని తిరిగి రాబట్టుకోవచ్చనేది రాజమౌళి నమ్మకం. పైగా ఈ సినిమాని హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలనుకుంటున్నారట.జేమ్స్ బాండ్ లాంటి స్టైలిష్ యాక్షన్ సినిమాలను హాలీవుడ్ లో బాగానే చూస్తారు. పూర్తిగా ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తారని.. ఆ రకంగా రూ. 800 కోట్లు రాబట్టుకోవడం పెద్ద విషయం కాదని భావిస్తున్నారట రాజమౌళి.