మహేష్ బాబు ఫీల్ అవుతారు.. నువ్వు ఒకసారి కళ్ళు చుపించుకో.. గంగవ్వకు సలహా ఇచ్చిన కేటీఆర్?

ఇటీవల కరీంనగర్ లో కళోత్సవాల పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతోపాటు ఎంతోమంది కళాకారులు కూడా పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ కళోత్సవాలు కార్యక్రమంలో చివరి రోజు మంత్రి కేటీఆర్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి గంగవ్వ కూడా హాజరు అయ్యింది.

మై విలేజ్ షోస్ ద్వారా ఫేమస్ అయిన రెండవ బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనె అవకాశం దక్కించుకోవడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇక ఇటీవల కరీంనగర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన గంగవ్వ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశిస్తూ మహేష్ బాబులా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మంత్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నన్ను మహేష్ బాబుల ఉన్నానని అంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ.. ఈ మాట ఆయన వింటే ఫీల్ అవుతారు. నన్ను మహేష్ బాబు అంటున్నావ్ అంటే ఒకసారి నువ్వు కళ్ళు చూపించుకో అంటూ గంగవ్వకు కేటీఆర్ సరదాగా సెటైర్ వేశాడు. అంతే కాకుండా ఎప్పుడు సినిమాలలో, యూట్యూబ్ వీడియోస్ లో చూసే గంగవ్వని ఇలా డైరెక్ట్ గా చూసినందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.