గాసిప్స్ : ‘నాని 30’ కి హార్ట్ టచింగ్ టైటిల్స్.?

టాలీవుడ్ టైర్ 2 టాప్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మరి నాని హీరోగా నటించిన రీసెంట్ భారీ పాన్ ఇండియా సినిమా “దసరా” తో సెన్సేషనల్ హిట్ ని అయితే తాను కొట్టాడు. మరి ఈ సినిమా తర్వాత అయితే నాని హీరోగా తన కెరీర్ లో 30వ సినిమా స్టార్ట్ చేసి దీనితో కూడా మంచి హిట్ అందుకోవాలని అయితే చూస్తున్నాడు.

కాగా ఈ సినిమాని మరో కొత్త దర్శకుడు తెరకెక్కిస్తూ ఉండగా ఇది దసరా కి పూర్తి భిన్నంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే రాబోతుంది. మరి ఈ సినిమా లో మరో సారి నాన్న పాత్రలో నాని కనిపించనుండగా దీనికి తగ్గట్టుగానే మేకర్స్ ఇప్పుడు పలు ఆసక్తికర టైటిల్స్ ని పరిశీలనలో పెట్టారట.

ముఖ్యంగా ఫాదర్ సెంటిమెంట్ ని ఎలివేట్ చేస్తూ కొన్ని హార్ట్ టచింగ్ పేర్లని కన్సడైర్ చేస్తున్నారని సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్స్ తెలుస్తున్నాయి. కాగా ఇపుడు అయితే “హాయ్ నాన్నా” లాంటి ఆసక్తికర టైటిల్స్ ని మేకర్స్ చూస్తున్నారట. దీనితో ఈ సినిమాకి టైటిల్ ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో రివీల్ కానున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ అవైటెడ్ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా మలయాళ హిట్ మ్యూజిక్ దర్శకుడు హీషమ్ అబ్దుల్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి కూడా భారీ మొత్తంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.