పవన్ “జల్సా” మళ్ళీ రిలీజ్ పై అదిరే అప్డేట్ ఇస్తున్న యూనిట్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో హిట్ ట్రాక్ తక్కువే ఉన్నా కూడా వాటిలో హిట్ అయ్యినవి మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసినవే ఉన్నాయని చెప్పాలి. అలాంటి కొన్ని చిత్రాల్లో సెన్సేషనల్ హిట్ “జల్సా” కూడా ఒకటి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు పవన్ నుంచి వచ్చిన ఈ చిత్రం 2008లో రిలీజ్ అయ్యి ఆ ఏడాదికి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా మారిన బర్త్ డే వేడుకలకి గాను స్టార్ హీరోల పాత సినిమాలవి కొత్త ప్రింట్స్ ని దింపుతుండడంతో వీటికి క్రేజీ డిమాండ్ నెలకొంది.

లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ”పోకిరి” కి 4కే క్వాలిటీ లో ప్రింట్ ని సిద్ధం చేసి భారీ ప్లాన్స్ తో రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా నెక్స్ట్ మంత్ లో పవన్ బర్త్ డే ఉండేసరికి పవన్ ఫ్యాన్స్ “జల్సా” సినిమాని ప్లాన్ చేసుకున్నారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ పై లేటెస్ట్ గా మెగా ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్(శ్రీనివాస కుమార్) సాలీడ్ అప్డేట్ ని అందించాడు.

ప్రస్తుతం సినిమా కొత్త ప్రింట్ పై అన్ని పనులు చక్కగా జరిగిపోతున్నాయని డెఫినెట్ గా గుడ్ న్యూస్ కొన్ని రోజుల్లో రావచ్చని తెలిపాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఇంకా ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ ట్రెండ్ సెట్టింగ్ బీట్స్ ఈ చిత్రానికి అందించాడు.