నితిన్ సరసన కాంతారా ఫేమ్‌

హిట్టు, ఫ్లాప్‌ టాక్‌తో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు నితిన్‌ . ఈ యంగ్‌ యాక్టర్‌ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ’తమ్ముడు’ .ఆగస్టులో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు`శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాంతార ఫేం సప్తమి గౌడ నటిస్తోంది. వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుందట.

త్వరలోనే ప్రొడక్షన్‌ టీం వర్ష బొల్లమ్మ పాత్రకు సంబంధించిన వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. నితిన్‌ మరోవైపు యువ దర్శకుడు వెంకీకుడుముల డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

దీంతోపాటు వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాలో కూడా నటిస్తున్నాడు నితిన్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన డేంజర్‌ పిల్లా లిరికల్‌ వీడియో సాంగ్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.