ఇండస్ట్రీ టాక్ : తన సినిమాకి త్రివిక్రమ్ మొట్టమొదటి సారి ఈ సాంగ్.?

తెలుగు సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. మరి చేసిన హీరోస్ తోనే హ్యాట్రిక్ సినిమాలు చేసి ఇప్పుడు హ్యాట్రిక్ కి హ్యాట్రిక్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా మూడో సినిమాని ఇపుడు చేస్తున్నాడు.

మరి మహేష్ 28వ సినిమా ప్లాన్ చేయగా దీనిని భారీ బడ్జెట్ తో అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ అవైటెడ్ సినిమా షూటింగ్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో నుంచి క్రేజీ బజ్ వినిపిస్తుంది. మరి ఈ చిత్రంతో అయితే త్రివిక్రమ్ మొట్ట మొదటిసారిగా ఓ సాంగ్ ని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే త్రివిక్రమ్ గత సినిమాల్లో చూస్తే సింగిల్ అమ్మాయితో సినిమా ఎలా లేదో అదే విధంగా ఐటెం సాంగ్ కూడా లేదు. మరి ఈసారి సింగిల్ అమ్మాయితో అయితే ఐటెం సాంగ్ ని త్రివిక్రమ్ మహేష్ కి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. పైగా దీని కోసం కూడా పెద్ద హీరోయిన్ నే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో అయితే ఈ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే లాస్ట్ టైం అత్తారింటికి దారేదిలో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ త్రివిక్రమ్ పెట్టినట్టు చాలా మందికి గుర్తు ఇక అక్కడ నుంచి మళ్ళీ ఏవి లేదు సో మహేష్ సినిమా మాత్రం దీనితో ఆసక్తిగా మారింది.