బిగ్ అప్డేట్ : నాని “హాయ్ నాన్న” ఎప్పుడు? ఎందులో అంటే 

Hi Nanna Movie Review

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర ఆల్ మోస్ట్ అందరి నోటెడ్ హీరోస్ మూవీస్ కూడా మంచి హిట్ అయ్యాయి. అలా ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో నేచురల్ స్టార్ నాని నుంచే రెండు సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో ఒకటి కంప్లీట్ మాస్ అయితే మరో సినిమా కంప్లీట్ క్లాస్ అని చెప్పాలి.

కాగా ఈ చిత్రాల్లో రీసెంట్ గా వచ్చిన సినిమానే “హాయ్ నాన్న”. కొత్త దర్శకుడు శౌర్యువ్ అనే కుర్రాడు తెరకెక్కించిన ఈ ఎమోషనల్ సినిమాలో నాని మరో సారి జీవించేసాడు. అంతే కాకుండా సీతారామం సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ మరోసారి టాలీవుడ్ లో హిట్ అందుకుంది. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో బాగానే రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. కాగా ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ వారి దగ్గర ఉండగా అందులో పాన్ ఇండియా రిలీజ్ ని ఇప్పుడు వారు కన్ఫర్మ్ చేశారు. మరి ఇందులో హాయ్ నాన్న రానున్న జనవరి 4 నుంచి అయితే అందుబాటులో ఉంటుంది అని ఇప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇచ్చేసారు.

తెలుగు తమిళ్ హిందీ సహా కన్నడ మలయాళ భాషల్లో హాయ్ నాన్న వస్తుంది అని నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేశారు. ఇంకా ఈ సినిమాకి హేశం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా ఈ సినిమాతో వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి మొదటి సినిమాతో మంచి లాభాలు అందుకున్నారు.